KTR: కేటీఆర్ పై ఏసీబీ కేసు... ఈ-కార్ రేసింగ్ కేసులో ఏ1గా కేటీఆర్

ACB case against KTR in Formula E Race case
  • అనుమతులు లేకుండా రూ. 55 కోట్లు చెల్లించినట్టు ఆరోపణ
  • కేసులో ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్
  • కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అవకాశం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదయింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే రూ. 55కోట్లు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదయింది.

కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి అనుమతించాలని గత నెల గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో, కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నాలుగు రోజుల క్రితం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదు చేయాలంటూ మూడు రోజుల క్రితం ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లేఖ రాశారు. గవర్నర్ అనుమతిని కూడా లేఖకు జత చేశారు. 

ఈ క్రమంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 13 (1) ఏ, 13 (2) పీసీ యాక్ట్, 409, 102 బీ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. కేబినెస్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా నిధులు చెల్లించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో, ఆయనను అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. రెండు, మూడు రోజులలో కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశం ఉంది.
KTR
BRS
Formula E Race
ACB

More Telugu News