Srinivas Goud: తెలంగాణలో ఆంధ్ర వాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యయే అవకాశం ఉంది: శ్రీనివాస్ గౌడ్

Andhra People may face trouble in Telangana says Srinivas Goud
  • తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందన్న శ్రీనివాస్ గౌడ్
  • దేవుడి ముందు అందరూ సమానమేనని వ్యాఖ్య
  • తెలంగాణలో లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనన్న శ్రీనివాస్ గౌడ్
దేవుడి ముందు అందరూ సమానమేనని... వివక్ష చూపడం సరికాదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని విమర్శించారు. ఇది మంది పద్ధతి కాదని చెప్పారు. 

తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పించిన సౌకర్యాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీటీడీ ఛైర్మన్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వాళ్లేనని అన్నారు. వ్యాపారాల్లో, పదవుల్లో లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనని చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Srinivas Goud
BRS
Tirumala

More Telugu News