YS Sharmila: అసెంబ్లీల గడువును లోక్ సభతో ముడిపెట్టడం సరికాదు: షర్మిల

Congress do not support one nation one election bill says YS Sharmila
  • జమిలి బిల్లును కాంగ్రెస్ సమర్థించదన్న షర్మిల
  • బీజేపీ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నారని విమర్శ
  • లోక్ సభలో ఓటింగ్ వ్యవహారం బీజేపీకి బెడిసికొట్టిందని వ్యాఖ్య
జమిలి ఎన్నికల బిల్లులను పార్లమెంటులో ప్రవేశ పెట్టడంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి... బీజేపీ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. 
 
పార్లమెంటులో పూర్తి మెజార్టీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం... బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమని షర్మిల అన్నారు. అసెంబ్లీల గడువును లోక్ సభతో ముడిపెట్టడం సమంజసం కాదని చెప్పారు. 

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న జమిలి బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని షర్మిల అన్నారు. రాజ్యాంగ సవరణకు కావాల్సిన మూడింట రెండొంతుల మోజార్టీ బీజేపీకి లేదనే విషయం లోక్ సభలో ఓటింగ్ తో తేలిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూలిపోతే... రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కూలిపోవాలని... ఇందులో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. లోక్ సభలో ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందని చెప్పారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే జమిలి బిల్లును కాంగ్రెస్ సమర్థించదని స్పష్టం చేశారు.
YS Sharmila
Congress
BJP

More Telugu News