Virat Kohli: గబ్బా టెస్టులో కోహ్లీ కెప్టెన్సీ.. రోహిత్‌ను ఒప్పించి సిరాజ్‌తో వికెట్ తీయించిన విరాట్.. వీడియో ఇదిగో!

Virat Kohli takes charge at Gabba captains Rohit Sharma against Steve Smith
  • ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌‌లో 11వ ఓవర్ వేసిన సిరాజ్
  • ఓవర్ ద వికెట్ బౌలింగ్ వేస్తానన్న సిరాజ్
  • వద్దన్న కెప్టెన్ రోహిత్ శర్మ
  • అదే కరెక్ట్ అని ఒప్పించిన కోహ్లీ
  • చివరి బంతికి స్మిత్‌ను అవుట్ చేసిన సిరాజ్
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరోమారు తన కెప్టెన్సీ పవర్‌ను చూపించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని ద గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఐదో రోజు కోహ్లీ తన కెప్టెన్సీ అనుభవంతో స్మిత్‌ను అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో జరిగిందీ ఘటన. అప్పటికి ఆసీస్ 28 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో తర్వాతి ఓవర్‌ కోసం మహ్మద్ సిరాజ్‌కు కెప్టెన్ రోహిత్ బంతి అందించాడు. బౌలింగ్‌కు రెడీ అయిన సిరాజ్ ఓవర్ ద వికెట్ మీదుగా బౌలింగ్ చేయాలనుకున్నాడు. అయితే, రోహిత్ అందుకు అంగీకరించలేదు.

అదే సమయంలో పిచ్ దాటుతున్న కోహ్లీ ఈ సంభాషణ విని వారి వద్దకు వెళ్లాడు. సిరాజ్ నిర్ణయానికి కోహ్లీ మద్దతు పలికాడు. ఓవర్ ద వికెట్ బౌల్ చేస్తే స్మిత్ ఆడేందుకు ఈజీ అవుతుందని రోహిత్ తన వాదన వినిపించాడు. అయితే, అది కరెక్ట్ కాదని, ఓవర్ ద వికెట్ మీదుగా బౌలింగ్ చేస్తే వికెట్ దక్కే అవకాశాలు ఉంటాయని చెప్పాడు. దీంతో రోహిత్ అంగీకరించక తప్పలేదు. ఓవర్ ద వికెట్ బౌల్ చేసిన సిరాజ్ ఆ ఓవర్ చివరి బంతికి స్మిత్‌ను అవుట్ చేశాడు. వీరి సంభాషణ స్టంప్స్‌లోని మైక్రో ఫోన్స్‌లో రికార్డయింది.
Virat Kohli
Rohit Sharma
Mohammed Siraj
Team India

More Telugu News