Georgia Resort: జార్జియాలో 11 మంది భారతీయుల మృతి

11 Indians found dead at restaurant in Georgias mountain resort of Gudauri
  • పనిచేస్తున్న రిసార్ట్ లోనే దారుణం
  • విషవాయువులే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
  • స్థానికుడితో కలిపి మొత్తం 12 మంది దుర్మరణం 
జార్జియాలోని స్కై రిసార్ట్ లో 12 మంది సిబ్బంది చనిపోయారు. వీరిలో 11 మంది భారతీయులేనని, మరొకరు స్థానికుడని అధికారులు తెలిపారు. రాత్రిపూట రిసార్ట్ మూసివేశాక తమ గదిలో పడుకున్న వారంతా పడుకున్నట్లే మృతి చెందారు. ప్రాథమిక విచారణ తర్వాత రిసార్ట్ సిబ్బంది మరణానికి కార్బన్ మోనాక్సైడ్ వాయువే కారణమని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుడౌరిలోని రిసార్ట్ లో చోటుచేసుకున్న విషాదంపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. 11 మంది భారతీయులు చనిపోయారని నిర్ధారించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.

గుడౌరీలోని రిసార్ట్ లో ఈ నెల 14న మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు కానీ, గాయాల ఆనవాళ్లు కానీ లేవని చెప్పారు. సిబ్బంది కోసం కేటాయించిన గది రిసార్ట్ రెండో అంతస్తులో ఉందని, దాని పక్కనే జనరేటర్ ఉందని వివరించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్ ను ఆన్ చేసి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఎలా విడుదలైందనే వివరాలు కానీ, సిబ్బంది మరణాలకు కచ్చితమైన కారణం కానీ తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. సిబ్బంది మరణానికి కారణం గుర్తించేందుకు దర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరించారు.
Georgia Resort
11 Indians
Indians Dead
Mountain Resort
Gudauri

More Telugu News