NTR Cine Diamond Jubilee: పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక... హాజరైన సీఎం చంద్రబాబు

Chandrababu attends NTR Cine Diamond Jubilee celebrations
  • ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం విడుదలై 75 ఏళ్లు
  • అత్యంత ఘనంగా సినీ వజ్రోత్సవ కార్యక్రమం
  • తారకరామం-అన్న గారి అంతరంగం పుస్తకావిష్కరణ 
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకను కృష్ణా జిల్లా పోరంకిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా ఏపీ సీఎం చంద్రబాబు, భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సీనియర్ నటి జయప్రద, నటుడు కృష్ణంరాజు అర్ధాంగి శ్యామల, సీనియర్ నిర్మాతలు కేఎస్ రామారావు, డి. సురేశ్ బాబు తదితర సినీ రంగ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఎన్టీఆర్ తొలి చిత్రం 'మనదేశం' విడుదలై 75 ఏళ్లయిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. 'తారకరామం-అన్న గారి అంతరంగం' అనే పేరుతో ఈ కమిటీ ఓ పుస్తకం కూడా రూపొందించగా... నేటి కార్యక్రమంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.

కాగా, ఎన్టీఆర్ తొలి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన కృష్ణవేణి కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం విశేషం.
NTR Cine Diamond Jubilee
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News