Ram Gopal Varma: అల్లు అర్జున్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం 'రిట‌ర్న్ గిఫ్ట్' ఇచ్చింది: ఆర్‌జీవీ

Telangana State Gave Allu Arjun the Biggest Return Gift by Sending Him to Jail Says Ram Gopal Varma
   
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయ‌డంపై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై ఆయ‌న మండిప‌డ్డారు. బ‌న్నీని జైలుకు పంపించిన‌ రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డుతూ ఆయ‌న తాజాగా 'రిట‌ర్న్ గిఫ్ట్' పేరుతో ఒక ట్వీట్ చేశారు. 

"తెలంగాణ‌కు చెందిన బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో అతిపెద్ద హిట్ కొట్టి రాష్ట్రానికి గొప్ప బ‌హుమ‌తి అందించారు. కానీ, రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఆయ‌న్ను జైలుకు పంపి బ‌న్నీకి రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చింది" అని ఆర్‌జీవీ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
Ram Gopal Varma
Allu Arjun
Telangana
Tollywood

More Telugu News