Jetwani: నటి జెత్వానీ కేసు.. కుక్కల విద్యాసాగర్ కు బెయిల్

Kukkala Vidyasagar gets bail in actress Jetwani case
  • జెత్వానీ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్
  • విద్యాసాగర్ తరపున వాదనలు వినిపించిన నిరంజన్ రెడ్డి
  • ఇదే కేసులో సస్పెండైన ముగ్గురు ఐపీఎస్ అధికారులు
ముంబై సినీ నటి జెత్వానీ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. జెత్వానీ, పోలీసుల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, విద్యాసాగర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదలను వినిపించారు. 

వాదనల సందర్భంగా నర్రా శ్రీనివాస్ తన వాదనలను వినిపిస్తూ... విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేస్తాడని చెప్పారు.  

ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లతో పాటు అధికారులందరిపైనా సస్పెన్షన్ వేటు పడింది. 
Jetwani
Kukkala Vidyasagar

More Telugu News