Revanth Reddy: రేవంత్, అదానీ టీషర్ట్ లతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. అడ్డుకున్న పోలీసులు

BRS leaders came to Assembly with Revanth Reddy and Adani T shirts
  • కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • తెలంగాణ విగ్రహ ఏర్పాటుపై ప్రకటన చేయనున్న సీఎం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ బిజినెస్ మేన్ అదానీల ఫొటోలతో ఉన్న టీషర్టులను వేసుకుని వచ్చారు. దీంతో, వారు అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ టీషర్టులు తొలగించి వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు.

మరోవైపు శాసనసభలో 5 కీలక బిల్లులతో పాటు, 2 నివేదికలను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు. విగ్రహ రూపురేఖల మార్పుపై రేవంత్ రెడ్డి వివరించనున్నారు. సమావేశాలను ఎన్నిరోజులు జరపాలనే విషయాన్ని బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
Revanth Reddy
Congress
Gautam Adani
BRS
TG Assembly

More Telugu News