Team India: అండర్-19 ఆసియా కప్ ఫైనల్: టీమిండియా టార్గెట్ 199 రన్స్

Bangladesh set Team India 199 runs target in Under19 Asia Cup Final
  • యూఏఈలో అండర్-19 ఆసియా కప్
  • దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్
  • 24 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన భారత్
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో నేడు టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ను టీమిండియా బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. దాంతో, బంగ్లా జట్టు 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ అయింది. 

టీమిండియా బౌలర్లలో యుధాజిత్ గుహా 2, చేతన్ శర్మ 2, హార్దిక్ రాజ్ 2, కిరణ్ చోర్మలే 1, కేపీ కార్తికేయ 1, ఆయుష్ మాత్రే 1 వికెట్ తీశారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో రిజ్వాన్ హసన్ 47, మహ్మద్ షిహాబ్ జేమ్స్ 40, ఫరీద్ హసన్ ఫైజల్ 39 పరుగులు చేశారు. 

అనంతరం, 199 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా యువ జట్టు 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే 1, వైభవ్ సూర్యవంశి 9 పరుగులకే వెనుదిరిగారు. 

ప్రస్తుతం భారత్ స్కోరు 7 ఓవర్లలో 2 వికెట్లకు 28 పరుగులు. ఆండ్రీ సిద్ధార్థ్ 10, కేపీ కార్తికేయ 2 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 43 ఓవర్లలో 171 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లున్నాయి. 


Team India
Bangladesh
Final
Under-19 Asia Cup

More Telugu News