minister nara lokesh: వైరల్ వీడియోపై మంత్రి నారా లోకేశ్ స్పందన

minister lokesh reacted to the srikakulam incident
  • అభ్యర్ధులను చిత్ర హింసలకు గురి చేస్తున్న ఆర్మీ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్న మంత్రి నారా లోకేశ్
ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ యజమాని అభ్యర్ధులను చిత్రహింసలకు గురి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. యువకుడిపై దాడిని ఖండించిన మంత్రి.. కారకులపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. 

శ్రీకాకుళం జిల్లాలో రిటైర్డ్ ఆర్మీ అధికారినంటూ వెంకట రమణ అనే వ్యక్తి స్థానికంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడానికి ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శిక్షణకు వచ్చిన ఓ యువకుడిని సంస్థ డైరెక్టర్ రమణ .. కరెంటు వైరుతో విచక్షణారహితంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

ఈ వీడియోను కొందరు నెటిజన్లు మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేసి స్పందించాలని కోరారు. దీనిపై లోకేశ్ వెంటనే స్పందించారు. కారకులపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ ఘటన 2023 డిసెంబర్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
minister nara lokesh
Srikakulam District
Crime News

More Telugu News