తెలంగాణకు కేంద్రం శుభవార్త... 7 నవోదయ పాఠశాలలకు కేబినెట్ ఆమోదం!

Seven Navodaya schools for Telangana
  • దేశవ్యాప్తంగా 28 నవోదయ పాఠశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
  • జగిత్యాల, సూర్యాపేట సహా ఏడు జిల్లాల్లో నవోదయ పాఠశాలలు
  • నవోదయ పాఠశాలల ఏర్పాటుకు రూ.2,359 కోట్లు ఖర్చవుతుందని అంచనా
తెలంగాణ రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది! దేశవ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలను కేటాయించింది.

తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే 85 కేంద్రీయ విద్యాలయాల కోసం రూ.5,872 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఇవి అందుబాటులోకి వస్తే ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో 960 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. 

కొత్తగా 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు రూ.2,359.82 కోట్ల వరకు ఖర్చు కానుంది. ఒక్కో నవోదయ విద్యాలయంలో 560 మంది విద్యార్థులకు అవకాశం ఉండనుంది.
Go Back to Shorts
Jawahar Navodaya Vidyalaya
Telangana
School

More Telugu News