Telangana: కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాటు తెలంగాణను దోచుకుంది: మహేశ్ కుమార్ గౌడ్

TPCC chief says KCR family robbed Telangana for ten years
  • బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 50 వేల ఉద్యోగాలే ఇచ్చిందని విమర్శ
  • ఇప్పుడు అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్క్ పాలన కనిపిస్తోందన్న టీపీసీసీ చీఫ్
  • లక్షల కోట్లు కొల్లగొట్టిన బీఆర్ఎస్‌కు మళ్లీ అధికారం ఇస్తారా? అని ఎద్దేవా
కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాటు తెలంగాణను దోచుకుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 50 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ మార్క్ పాలన కనిపిస్తోందన్నారు.

ప్రజాపాలన పండుగలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మీకు ప్రజలు మళ్లీ అధికారం ఇస్తారా? అని నిలదీశారు. 

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ చెబుతున్నారని, కానీ రాజీవ్ గాంధీ, ఆయన కుటుంబం చేసిన త్యాగం తెలుసా? అని ప్రశ్నించారు. వారి కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించిందన్నారు. తెలంగాణ కోసం కేటీఆర్ చేసిన త్యాగం ఏమిటో చెప్పాలని నిలదీశారు. భూములు, నిధులు, నియామకాల పేరుతో కేసీఆర్ కుటుంబం అడ్డంగా దోచుకుందని ధ్వజమెత్తారు.
Telangana
Congress
Mahesh Kumar Goud
KCR

More Telugu News