ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని దారుణంగా హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్
- ఐఏసీ సంస్థ ఫౌండర్ బసవ రమణ దాష్టీకం
- ఉద్యోగాల పేరిట విద్యార్థుల వద్ద రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేసిన వైనం
- ఆ తర్వాత వారిని శారీరకంగా హింసిస్తూ రాక్షసానందం పొందుతున్న శాడిస్ట్
ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్సులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ ఓ ఎక్స్ (ట్విట్టర్) యూజర్ మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేశారు. అన్నయ్య ఇది చాలా సీరియస్ ఇష్యూ అని అతడు పేర్కొన్నాడు. విద్యార్థులను బసవ రమణ కేబుల్ వైర్‌తో కొడుతున్న వీడియోను కూడా ఈ ట్వీట్‌కు జోడించాడు.