Alipiri: అలిపిరి తుడా కార్యాలయం వద్ద స్వాముల నిరసన

Protest at Alipiri TUDA office against Mumtaj hotel
  • అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
  • అనుమతి లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా తుడా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శ
  • నిర్మాణ పనులను వెంటనే ఆపాలని డిమాండ్
తిరుపతి అలిపిరి వద్ద ఉన్న తుడా కార్యాలయం వద్ద స్వాములు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అలిపిరి వద్ద ముంతాజ్ హాటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. ముంతాజ్ అనే ముస్లిం పేరుతో పవిత్రమైన ఏడు కొండల పక్కన స్టార్ హోటల్ నిర్మించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని వారు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో శ్రీనివాసానంద స్వామితో పాటు పలువురు స్వాములు పాల్గొన్నారు. 

తుడా అనుమతి లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్వాములు మండిపడ్డారు. హోటల్ నిర్మాణ పనులను తుడా అధికారులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ముంతాజ్ హోటల్ నిర్మిస్తున్న స్థలంలో ఆథ్యాత్మిక కేంద్రం, భక్తుల కోసం విడిది కేంద్రాలను నిర్మించాలని కోరారు. 
Alipiri
Mumtaj Hotel

More Telugu News