Visakhapatnam: విశాఖలో విషాదం .. భవనం పైనుండి దూకి ప్రేమజంట ఆత్మహత్య

visakha love couple died by jumping from the apartment
  • గాజువాకలో ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకేసిన ప్రేమ జంట 
  • దుర్గారావు, సుష్మిత అక్కడికక్కడే మృతి
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విశాఖపట్నంలోని గాజువాక పరిధిలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత గాజువాకలోని ఓ ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాలవారు అమలాపురం నుంచి బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చి షీలానగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. 

ఈ క్రమంలో దుర్గారావు, సుష్మిత మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు ఇద్దరు ఓ అపార్ట్‌మెంట్ పైనుండి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాలనీ వాసులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Visakhapatnam
gajuwaka
young couple
suicide

More Telugu News