Pawan Kalyan: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్‌.. ప‌వ‌న్ సెల్ఫీ వైర‌ల్‌!

Pawan Kalyan Selfie from Hari Hara Veera Mallu Shooting Spot goes Viral on Social Media
  • మంగళగిరిలో 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' మూవీ చివ‌రి షెడ్యూల్ షూటింగ్‌
  • తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన ప‌వ‌న్‌
  • సెట్స్ లో దిగిన సెల్ఫీని త‌న ఇన్‌స్టా ద్వారా అభిమానుల‌తో పంచుకున్న వైనం
  • సంబ‌రాలు చేసుకుంటున్న ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌
రాజ‌కీయాల్లో పూర్తిగా బిజీ అయిన పవన్ కల్యాణ్ ప్ర‌స్తుతం కొంత‌ గ్యాప్ దొర‌క‌డంతో 'హరిహర వీరమల్లు' సినిమా పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. ప్రస్తుతం ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ షూటింగ్ మంగళగిరిలో వేసిన ఓ సెట్‌లో జ‌రుగుతోంది. దీనిలో భాగంగా మేక‌ర్స్‌ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.

తాజాగా పవన్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా 'హరిహర వీరమల్లు' సెట్స్ లో దిగిన సెల్ఫీని త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. "చాలా బిజీగా ఉండే పొలిటికల్ షెడ్యూల్స్ నుంచి నా సమయంలో కొన్ని గంటలు ఎన్నాళ్ల‌ నుంచో పెండింగ్ లో ఉన్న వర్క్ కి కేటాయించాను" అని ప‌వ‌న్ త‌న ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు. దీంతో ప్ర‌స్తుతం పవన్ పోస్ట్ వైరల్ అవుతోంది.

పవన్ ఇలా సెల్ఫీ పెట్టడం, అది కూడా హరిహర వీరమల్లు సెట్స్ నుంచి పెట్టడంతో ఆయ‌న అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ సినిమా 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
Pawan Kalyan
Hari Hara Veera Mallu
Instagram
Tollywood

More Telugu News