కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి!

Ganja In Police Conistable House
  • సీజ్ చేసిన గంజాయిని కాజేస్తూ బయట అమ్మకం
  • కాజీపేట డివిజన్ లో కానిస్టేబుల్ నిర్వాకం
  • అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఉన్నతాధికారులు
 మత్తు పదార్థాల వాడకాన్ని అరికట్టే బాధ్యత నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ డబ్బు కోసం అక్రమ మార్గం పట్టాడు. ఓ రెయిడ్ లో దొరికిన గంజాయిని సీజ్ చేసి ఠాణాలో పెట్టగా.. సదరు కానిస్టేబుల్ గుట్టు చప్పుడు కాకుండా దశల వారీగా కాజేస్తూ వచ్చాడు. ఇలా కాజేసిన గంజాయిని తన స్నేహితులు, బంధువుల సాయంతో విద్యార్థులకు అమ్ముతూ సొమ్ము చేసుకున్నాడు. కాజీపేట పోలీస్ డివిజన్ కరీంనగర్ రోడ్ లోని ఠాణాలో చోటుచేసుకుందీ అక్రమం. ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...

నర్సంపేటకు చెందిన కానిస్టేబుల్ ఈ ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ఓ రెయిడ్ లో పెద్ద మొత్తంలో పట్టుబడ్డ గంజాయిని అధికారులు ఇదే ఠాణాలో సీజ్ చేసి పెట్టారు. దీనిపై కన్నేసిన సదరు కానిస్టేబుల్.. దశల వారీగా గంజాయిని ఇంటికి తీసుకెళ్లాడు. తన స్నేహితులు, బంధువులకు ఇచ్చి అమ్మించాడు. ఈ క్రమంలో నర్సంపేట నుంచి వరంగల్ వచ్చే మార్గంలో వాహనాల తనిఖీ చేపట్టగా ఓ బైక్ పై వచ్చిన యువకులు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంబడించి పట్టుకున్న పోలీసులు వారిని సోదా చేయగా గంజాయి లభ్యమైంది. ఆ తర్వాత విచారణలో కానిస్టేబుల్ పేరు బయటకు వచ్చింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి సదరు కానిస్టేబుల్ ఇంట్లో సోదాలు నిర్వహించగా తస్కరించిన గంజాయి దొరికింది. ప్రస్తుతం కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
Go Back to Shorts
Ganja
Conistable
Seized ganja
Police Station
Narsampet
Kazipet

More Telugu News