Allu Arjun: బన్నీకి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్.. థ్యాంక్స్ చెప్పిన 'పుష్ప'
- రౌడీ బ్రాండ్ కలెక్షన్స్ నుంచి టీషర్టులను బన్నీకి గిఫ్ట్ గా పంపిన విజయ్
- వాటిపై 'పుష్ప' పేరును ప్రత్యేకంగా రాయించిన వైనం
- 'నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు కృతజ్ఞతలు' అని అల్లు అర్జున్ ట్వీట్
- 'లవ్ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి' అని విజయ్ రిప్లై
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించారు. తన రౌడీ బ్రాండ్ కలెక్షన్స్ నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేసిన టీషర్టులను బన్నీకి పంపారు. వాటిపై పుష్ప పేరు ప్రత్యేకంగా రాయించారు. ఆ గిఫ్ట్ అందుకున్న అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు థ్యాంక్స్ చెప్పారు.
'నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు కృతజ్ఞతలు' అని ఆ టీషర్టుల తాలూకు ఫొటోను బన్నీ పంచుకున్నారు. దానికి విజయ్ 'లవ్ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి' అని రిప్లై ఇచ్చారు. దీంతో ఇద్దరు హీరోల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే... అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప-2' మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం చిత్రబృందం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బన్నీ కూడా రోజుల వ్యవధిలోనే దేశంలోని పలు ప్రధాన నగరాలలో నిర్వహిస్తున్న ఈవెంట్లలో పాల్గొంటున్నారు.
ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి నగరాలలో నిర్వహించిన ఈవెంట్స్‌లో పాల్గొన్న ఐకాన్ స్టార్.. ఈరోజు ముంబయిలో నిర్వహించే ప్రెస్‌మీట్‌కు హాజరుకానున్నారు. కాగా, పుష్ప-2 సెన్సార్ కూడా పూర్తి చేసుకుని యూ/ ఏ సర్టిఫికేట్ పొందిన విషయం తెలిసిందే. మూడు గంటలకు పైగా నిడివితో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.