కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

Kadapa court quashes MP Avinash Reddy PA petition
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ నేత, కడప లోక్ సభ సభ్యుడు అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కడప జిల్లా కోర్టు కొట్టివేసింది. అసభ్య పోస్టుల వ్యవహారంలో అరెస్టైన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు రాఘవరెడ్డిపై కేసు నమోదు చేశారు. పదహారు రోజులుగా రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు.

దీంతో అరెస్ట్ భయంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సునీత, విజయమ్మపై వర్రా రవీందర్ రెడ్డితో రాఘవరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
Go Back to Shorts
Kadapa District
YS Avinash Reddy
YSRCP
Telugudesam

More Telugu News