ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఆటోలోనే ప్రసవించిన మహిళ.. సంగారెడ్డి జిల్లాలో ఘటన
- పుర్య నాయక్ తండాకు చెందిన మహిళకు పురిటి నొప్పులు
- ఆటోలో ఆరోగ్య కేంద్రానికి బయలుదేరిన కుటుంబ సభ్యులు
- రోడ్డుపై గుంతల కారణంగా మార్గమధ్యంలోనే ప్రసవం
రోడ్డు అధ్వానంగా, గుంతలమయంగా ఉండడంతో స్వప్నకు నొప్పులు ఎక్కువయ్యాయి. కొద్దిదూరం వెళ్లగానే ప్రసవం అయ్యే సూచనలు కనిపించడంతో ఆటోను రోడ్డు పక్కన ఆపి కుటుంబ సభ్యులు పురుడుపోశారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన మండల వైద్యాధికారులు తల్లీబిడ్డలను ఝరాసంగం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వివరించారు. అత్యవసర వైద్య సేవలకు 108 కు ఫోన్ చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య సూచించారు. అయితే, పుర్య నాయక్ తండాకు వెళ్లే రోడ్డు బాలేదని, వాహనాలు ఏవీ రావడంలేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే 108 కు ఫోన్ చేయలేదని వివరించారు.