రాత్రి నారావారిపల్లెలో బస చేసిన చంద్రబాబు
- నేడు నారా రామ్మూర్తినాయుడు కర్మక్రియలు
- రాత్రి నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు, నారా లోకేశ్
- ఈ నెల 16న కన్నుమూసిన రామ్మూర్తినాయుడు
గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరిన చంద్రబాబు, నారా లోకేశ్ సాయంత్రం 6.35 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకున్నారు. మరోవైపు, ఈ రాత్రికి చంద్రబాబు నారావారిపల్లోనే బస చేస్తారా? లేక తిరుగుపయనమవుతారా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఈ నెల 16వ తేదీన రామ్మూర్తినాయుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన... హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు. దీంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆ మరుసటి రోజు నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అంత్య్రక్రియల కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ తో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.