pawan kalyan: బంగ్లాదేశ్ లో కృష్ణదాస్ అరెస్టు, జగన్ కు అదానీ ముడుపుల అంశాలపై పవన్ స్పందన

Pawan Kalyan response on Chinmay Krishnadas arrest in Bangladesh
  • కృష్ణదాస్ అరెస్ట్ పై అందరం కలిసికట్టుగా పోరాడుదామన్న పవన్
  • బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు కలచివేస్తోందని ఆవేదన
  • జగన్ అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య
బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ప్రచారకుడు చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేయడం భారత్ లో కలకలం రేపుతోంది. ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కృష్ణదాస్ అరెస్ట్ పై అందరం కలిసికట్టుగా పోరాడుదామని చెప్పారు. బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తనను తీవ్రంగా కలచివేస్తోందని అన్నారు. 

హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైనికులు రక్తం చిందించారని... ఆనాడు బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ తో చేసిన యుద్ధంలో దేశ వనరులు ఖర్చవడంతో పాటు మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 

ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... జగన్ కు అదానీ ముడుపుల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నారని... ఈ అంశంపై కేబినెట్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అవకతవకలు జరిగాయని... అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోయిన ఎర్రచందనాన్ని కర్ణాటకలో పట్టుకున్నారని... అలా పట్టుబడిన ఎర్రచందనం విక్రయాల్లో మన రాష్ట్ర వాటాపై కూడా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇప్పటికే మాట్లాడానని వెల్లడించారు. 
pawan kalyan
janasena

More Telugu News