priyanka Jain: ప్రియుడితో కలిసి రీల్స్.. ఇబ్బందుల్లో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్

Bigg Boss fame Priyanka Jain in trouble
  • ప్రియుడితో కలిసి తిరుమలకు వెళ్లిన ప్రియాంక
  • మెట్లమార్గంలో చిరుత వచ్చిందంటూ ప్రాంక్ వీడియో
  • కేసులు పెడతామన్న భానుప్రకాశ్ రెడ్డి
బిగ్ బాస్ ఫేమ్, సీరియల్స్ నటి ప్రియాంక జైన్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే... తన ప్రియుడు శివకుమార్ తో కలిసి ప్రియాంక తిరుమలకు వచ్చింది. ఈ క్రమంలో తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడవ మైలు రాయి వద్ద తన ప్రియుడితో కలిసి ఆమె రీల్స్ చేసింది. చిరుత వచ్చిందంటూ వీరిద్దరూ అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఈ వీడియోను వీరు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రియాంక జైన్, శివకుమార్ లపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. పవిత్రమైన తిరుమల కొండపై ప్రాంక్ వీడియోల పేరుతో ఇదేం పని? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రాంక్ వీడియోలు చేసిన వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి నిర్వాకంపై టీటీడీ బోర్డ్ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. వీరిపై కేసులు పెడతామని చెప్పారు.
priyanka Jain
Tirumala

More Telugu News