Shaktikanta Das: హాస్పిటల్‌లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. కొన్ని గంటల్లోనే డిశ్చార్జ్

Shaktikanta Das was hospitalised in Chennai with a minor health issue
  • ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న ఆర్బీఐ గవర్నర్
  • చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చేరిక
  • 2-3 గంటల్లోనే డిశ్చార్చ్ అవుతారని ఆర్బీఐ ప్రకటన
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చిన్నపాటి అనారోగ్య సమస్యతో చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. ఎసిడిటీతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆయన మరో 2-3 గంటల్లోనే డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా ఆర్బీఐ ప్రకటించింది. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొన్ని గంటల్లోనే డిశ్చార్జ్ అవుతారని తెలిపింది.

ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, పరిశీలన కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారని వివరించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
Shaktikanta Das
RBI
Business News

More Telugu News