Nana Patole: నేను రాజీనామా చేయలేదు: నానా పటోలే

I am not resigned says Nana Patole
  • మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం
  • పీసీసీ చీఫ్ పదవికి నానా పటోలే రాజీనామా చేశారంటూ వార్తలు
  • ఆ వార్తల్లో నిజం లేదన్న పటోలే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను పటోలే ఖండించారు. రాజీనామా చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. తాను రాజీనామా చేయలేదని... మహా వికాస్ అఘాడీ చెక్కుచెదరకుండా ఉంటుందని అన్నారు.   

మహారాష్ట్ర శాసనసభలో 288 సీట్లు ఉండగా ఎన్డీయే కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 51 స్థానాల్లో గెలుపొందింది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మహారాష్ట్రలో చరిత్రలో ఎప్పుడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్ మారిపోయింది.
Nana Patole
Congress
Maharashtra

More Telugu News