Gulab Jamun: మొదటిసారి గులాబ్ జామూన్ తిన్న కొరియన్ మహిళ.. ఆమె రియాక్ష‌న్‌కు నెటిజ‌న్ల ఫిదా.. వైర‌ల్ వీడియో!

Video Shows Korean Woman Eating Gulab Jamun For The First Time Her Reaction Goes Viral
  
మొదటిసారి గులాబ్ జామూన్ తిన్న ఓ కొరియన్ మహిళ రియాక్ష‌న్ తాలూకు వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అవుతోంది. కంటెంట్ క్రియేట‌ర్ అయిన కెల్లీ కొరియా అనే మ‌హిళ ప్ర‌స్తుతం మహారాష్ట్రలోని పూణేలో నివసిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె తాజాగా గులాబ్ జామూన్ తిన్నారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియోను ఆమె త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

వీడియోలో కెల్లీ ఒక గులాబ్ జామూన్ ఓ బౌల్‌లో తీసుకుని మొద‌ట దాన్ని ఆసక్తిగా గ‌మ‌నించ‌డం మ‌నం చూడొచ్చు. అస‌లు అది ఏంటి దాన్ని ఎలా తినాలో తెలియడం లేదని ఆమె చెప్ప‌డం వీడియోలో ఉంది. దాంతో కొంతమంది ఆమెకు అది గులాబ్ జామూన్ అని, అందులోంచి చిన్న ముక్క‌ను స్పూన్‌తో క‌ట్ చేసి తినాల‌ని సూచించారు. 

దాంతో వెంట‌నే ఆమె ఒక చిన్నముక్క‌ను తీసుకుని నోట్లో వేసుకున్నారు. అంతే.. ఆ త‌ర్వాత కెల్లీ ఇది చాలా మృదువుగా, తియ్య‌గా ఉంద‌ని, తనకు ఇది చాలా న‌చ్చిందంటూ ఒక ర‌క‌మైన రియాక్ష‌న్ ఇవ్వ‌డం వీడియోలో ఉంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు. 
Gulab Jamun
Korean Woman
Viral Videos

More Telugu News