ar rahman: లీగల్ నోటీసులు పంపిన ఏఆర్ రెహమాన్

ar rahman issues legal notice to all slanderers amid divorce with saira banu
  • విడాకుల అంశంపై మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఆగ్రహం
  • కంటెంట్ తొలగించకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక
  • పరువు నష్టం దావా నోటీసు విడుదల చేసిన ఏఆర్ రెహమాన్ న్యాయవాది నర్మదా సంపత్
తనపై దుష్ప్రచారం చేసిన సోషల్ మీడియా, ప్రధాన మీడియా సంస్థలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బిగ్ షాక్ ఇచ్చారు. తన విడాకులపై, తన కుటుంబంపై అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేసేలా ఉన్న వార్తలు, సోషల్ మీడియా పోస్టులను, వీడియోలు డిలీట్ చేయాలని రెహమాన్ డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా తనపై జరిగిన దుష్ప్రచారానికి సంబంధించిన కంటెంట్ ఏ రూపంలో ఉన్నా మొత్తం తొలగించకపోతే భారతీయ న్యాయ సంహితలోని 356 సెక్షన్ కింద పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరిస్తూ ఏఆర్ రెహమాన్ తరపు న్యాయవాది బహిరంగ నోటీసులు విడుదల చేశారు.  
 
ఏఆర్ రెహమాన్ ఆయన భార్య సైరా బాను పరస్పర అంగీకారంతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని తొలుత సైరా బాను తరపున న్యాయవాది వందనా షా మీడియాకు వెల్లడించగా, తర్వాత రెహమాన్ సైతం విడాకులపై ప్రకటన చేశారు. తమ జీవితంలో ఇది టఫ్ ఫేజ్ అని వారి ప్రకటనలో ఇద్దరూ పేర్కొన్నారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు తెలియాలని విడాకుల నిర్ణయం అధికారికంగా ప్రకటించామన్నారు. ఎంతో బాధతో తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని సైతం పేర్కొన్నా కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు.  

తన క్లైయింట్‌కు సంబంధించి యూట్యూబ్, ట్విట్టర్ (ఎక్స్), ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ఇతర ఆన్ లైన్ సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో చేసిన అసత్యప్రచారానికి సంబంధించి మొత్తం కంటెంట్ తొలగించాలని న్యాయవాది నర్మదా సంపత్ నోటీసులో పేర్కొన్నారు.  
 
ar rahman
divorce
saira banu

More Telugu News