kotla saibaba: యూకేలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా కోట్ల సాయిబాబా

kotla saibaba appointed as brs uk cell spokes person
  • ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గం ఎన్నిక
  • యూకే విభాగం అధికార ప్రతినిధిగా, నార్త్ ఇంగ్లాండ్ ఇన్ చార్జిగా, సోషల్ మీడియా కన్వీనర్‌గా సాయిబాబా 
  • ఆమనగల్లు మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కోట్ల సాయిబాబా
ఆమనగల్లు మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కోట్ల సాయిబాబాకు బీఆర్ఎస్‌ ఎన్ఆర్ఐ విభాగంలో కీలక పదవి లభించింది. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఈ క్రమంలో సాయిబాబా పార్టీ యూకే విభాగం అధికార ప్రతినిధిగా, నార్త్ ఇంగ్లాండ్ ఇన్ చార్జిగా, సోషల్ మీడియా కన్వీనర్‌గా నియమితులయ్యారు. 
 
ఈ సందర్భంగా సాయిబాబా స్పందిస్తూ.. తనపై నమ్మకంతో ఈ పదవులు ఇచ్చినందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మచలంకు కృతజ్ఞతలు తెలియజేశారు.  
kotla saibaba
brs uk cell
spokes person

More Telugu News