Licking Ice Sticks: ఐస్‌క్రీంను నాకి రుచి చూసి ప్యాకింగ్ చేస్తున్న ఫ్యాక్టరీ సిబ్బంది.. వీడియో ఇదిగో!

Staff At Ice Cream Factory Caught Licking Ice Sticks Before Packaging
  • కేరళలోని కోజికోడ్‌లో ఉన్న ‘ఐస్ మీ’ ఫ్యాక్టరీలో ఘటన
  • ఐస్‌లు కొనుగోలుకు వెళ్లి సిబ్బంది నిర్వాకాన్ని చూసి వీడియో తీసిన కష్టమర్
  • నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు
  • కంపెనీని సీజ్ చేసి పరీక్షల కోసం శాంపిళ్లను సేకరించిన పోలీసులు
ఐస్‌క్రీంలను షాప్‌లకు పంపడానికి ముందు వాటిని నాకి రుచి చూసి ప్యాక్ చేస్తున్న సిబ్బంది వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై సర్వత్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన పోలీసులు కంపెనీని సీజ్ చేశారు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిందీ ఘటన.

ఇక్కడి ‘ఐస్ మీ’ కంపెనీ సిబ్బంది తయారైన ఐస్‌క్రీంలను ప్యాక్ చేయడానికి ముందు వాటిని చప్పరించి రుచి చూస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. అది చూసి ఆగ్రహంతో రగిలిపోయిన ప్రజలు కంపెనీకి వెళ్లి ఐస్‌క్రీంలు నాకుతున్న రషీద్ అనే వ్యక్తిని పట్టుకుని కొడువల్లి పోలీసులకు అప్పగించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కంపెనీ రిజిస్ట్రేషన్ రద్దు చేసి తదుపరి చర్యల కోసం నివేదికను అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు పంపారు. 

ఐస్‌క్రీంను కొనుగోలు చేసేందుకు కంపెనీకి వెళ్లిన ఓ కష్టమర్ ఐస్‌లు నాకి ప్యాక్ చేస్తున్న సిబ్బందిని చూసి గుట్టుచప్పుడు కాకుండా వీడియో తీశాడు. వీడియో వైరల్ కావడం, స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కంపెనీని సీల్ చేశారు. అనంతరం శాంపిళ్లు సేకరించి పరీక్షల కోసం మలప్పురం రీజనల్ అనలిటికల్ ల్యాబ్‌కు పంపారు.   
Licking Ice Sticks
Kerala
Kozhikode
Viral Video

More Telugu News