cm pawan kalyan: ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలి: పవన్ కల్యాణ్

deputy cm pawan kalyans tweet on the complaints he is receiving
  • ప్రభుత్వ భూముల ఆక్రమణ, బలవంతపు భూసేకరణలపై పవన్ కు అనేక ఫిర్యాదులు
  • ఫిర్యాదులపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్న పవన్
  • తమ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని వెల్లడి 
డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తనకు వస్తున్న వివిధ ఫిర్యాదులపై ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు ప్రైవేటు భూముల ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు కాకినాడ పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ఫిర్యాదులపై ప్రాధాన్యతను ఇస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. ఈ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో, నేరస్థులను బాధ్యులను చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.  
cm pawan kalyan
complaints
tweet

More Telugu News