Viral Videos: ఇది ఏనుగుల ‘చక్ర వ్యూహం’... వైరల్ వీడియో ఇదిగో!

This is elephant level security here is the viral video

  • అడవిలో విహరిస్తున్న ఓ ఏనుగుల గుంపు
  • అకస్మాత్తుగా అటువైపు వచ్చిన రెండు చిరుత పులులు
  • తమ పిల్లల రక్షణ కోసం ‘చక్ర వ్యూహం’ పన్నిన ఏనుగులు

మనుషులైనా, జంతువులైనా తమ రక్షణ, తమ పిల్లల రక్షణ కోసం ప్రయత్నించడం మామూలే. కానీ ఇక్కడ ఏనుగులు తమ పిల్లలను రక్షించుకునేందుకు చేసిన ఏర్పాటు మాత్రం మామూలుగా లేదు. 

కొన్ని ఏనుగులు, వాటి పిల్లలతో కలసి అడవిలో విహరిస్తున్నాయి. ఇంతలో అక్కడికి రెండు చిరుతపులులు దూసుకొచ్చాయి. వాటిని చూసిన ఏనుగులు... తమ పిల్లలను ఒకచోటికి చేర్చాయి. తమ పిల్లలను మధ్యలో ఉంచి, ఐదు ఏనుగులు వాటికి రక్షణగా ‘చక్ర వ్యూహం’ పన్నాయి. ఐదూ కూడా ఐదు వైపులకు తలను తిప్పి వలయంలా నిలిచాయి. ఎటువైపు నుంచి దాడి చేసినా గట్టిగా తిప్పికొట్టేందుకు రెడీ అయ్యాయి.

  • దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో వైరల్‌ గా మారింది. రెండు రోజుల్లోనే ఆరు లక్షల వరకు వ్యూస్‌, వేల కొద్దీ లైకులు వచ్చాయి.
  • ఏనుగుల తీరు అద్భుతం, వలయంలా భలే వ్యూహం పన్నాయి అంటూ చాలా మంది అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
  • ఆ ఏనుగుల తీరు చూస్తే... పిల్లల రక్షణ కోసం జంతువులైనా, మనుషులైనా ఎంతగా తపిస్తారన్నది తెలిసిపోతోందని మరికొందరు పేర్కొంటున్నారు.

Viral Videos
Elephants
offbeat
viral
X Corp
Twitter
Security
  • Loading...

More Telugu News