K Kavitha: కులగణనలో వివరాలు నమోదు చేయించుకున్న కవిత

Kavitha residence was visited by officials conducting the caste survey
  • కులగణనపై డెడికేటెడ్ కమిషన్‌ను నివేదిక సమర్పించనున్న తెలంగాణ జాగృతి
  • రౌండ్ టేబుల్ సమావేశాల్లోని అభిప్రాయాలను క్రోడీకరించి సమర్పించనున్న కవిత
  • రాజకీయ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్న కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కులగణనలో తన వివరాలను నమోదు చేయించుకున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి కులగణన అధికారులు వచ్చారు. కవిత అధికారులకు సహకరించి వివరాలను నమోదు చేయించుకున్నారు.

కులగణన డెడికేటెడ్ కమిషన్‌కు తెలంగాణ జాగృతి నివేదిక

కుల సర్వే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక అందించాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి అధ్యక్షురాలు కవిత డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు నివేదికను అందించనున్నారు. శుక్రవారం కవిత నివాసంలో తెలంగాణ జాగృతి నాయకులు, ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై కొన్ని నెలల క్రితం జాగృతి అధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఆ సమావేశాల్లో తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు పాల్గొని అభిప్రాయాలను తెలియజేశారు. వాటిని క్రోడీకరించి తెలంగాణ జాగృతి నివేదికను రూపొందించింది. జిల్లాల వారీగా పూర్తి వివరాలు, బీసీల లెక్కలతో తెలంగాణ జాగృతి సమగ్ర నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కమిషన్‌కు అందించాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది.

బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాలి

ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ... బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వేను నామమాత్రంగా కాకుండా పకడ్బందీగా చేసి రిజర్వేషన్లు పెంచి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
 
K Kavitha
Caste Census
Telangana
BRS

More Telugu News