Mohan Babu: 'క‌న్న‌ప్ప' నుంచి మోహ‌న్ బాబు లుక్ రివీల్‌

Mohan Babu Playing Mahadeva Shastri Character in Kannappa
  • 'క‌న్న‌ప్ప'లో 'మహాదేవ శాస్త్రి' పాత్ర‌లో మోహ‌న్ బాబు
  • చిరకాలం గుర్తుండిపోయే భయంకరమైన పాత్ర అంటూ మంచు విష్ణు ట్వీట్
  • కీల‌క పాత్ర‌ల్లో మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజ‌ల్
మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం క‌న్న‌ప్ప‌. ఈ మూవీ నుంచి తాజాగా మ‌రో అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలో మోహ‌న్ బాబు న‌టిస్తున్న 'మహాదేవ శాస్త్రి' పూర్తి లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 

ఈ పాత్ర చాలా కాలం పాటు గుర్తుండిపోతుంద‌ని మంచు విష్ణు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పేర్కొన్నారు. 'మహాదేవ శాస్త్రి' చిరకాలం గుర్తుండిపోయే భయంకరమైన పాత్ర అంటూ ట్వీట్ చేశారు. 

కాగా, కన్నప్పలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజ‌ల్ వంటి హేమాహేమీలు నటిస్తుండడంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ నెలకొంది. ఈ మూవీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. 
Mohan Babu
Mahadeva Shastri
Kannappa
Manchu Vishnu
Tollywood

More Telugu News