Nayanthara: ఒకే వేదికపైకి నయనతార, ధనుశ్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

 Amid Big Feud Nayanthara And Dhanush Avoid Each Other At A Wedding Ceremony
  • టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్‌ భాస్కర్ వివాహం
  • ఒకే వేదికపై ప్ర‌త్య‌క్ష‌మై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన‌ నయనతార, ధనుశ్‌
  • వీడియోను షేర్ చేసిన‌ నయనతార, విఘ్నేష్ శివన్ సెక్యూరిటీ టీమ్
గత వారం రోజులుగా కోలీవుడ్ న‌టులు నయనతార, ధనుశ్ వివాదం నెట్టింట వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. దానికి కార‌ణం నయనతార త‌న‌ డాక్యుమెంటరీలో వాడిన మూడు సెకన్ల నిడివి క‌లిగిన‌ క్లిప్పింగ్‌. దాంతో ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఒకరినొకరు దోషిగా చూపిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చెన్నై వేదికగా జరిగిన ఒక వివాహ వేడుకకి ఇద్దరు స్టార్లు హాజరై అంద‌రినీ ఆశ్చర్యపరిచారు. 

టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్‌ భాస్కర్ వివాహ వేదిక‌పై ఇలా న‌య‌న్‌, ధ‌నుశ్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. గురువారం ఆకాశ్‌ భాస్కర్ పెళ్లికి తొలుత ధనుష్ హాజరవగా.. ఆ తర్వాత నయనతార కూడా తన భర్త విఘ్నేశ్ శివన్‌తో క‌లిసి వచ్చారు. 

ఇక సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారికి వివాహ వేదికలో ముందు వరుస కుర్చీలను కేటాయించారు. దాంతో ధనుశ్‌, నయనతార ఒకే వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. అయితే, ఆ ఇద్దరూ కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి కూడా తొలుత సెలెబ్రిటీలు వెళ్లగా.. అక్కడ కూడా నయనతార, ధనుశ్‌ ఎడమొఖం, పెడమొఖంగానే ఉన్నారు. 

ఈ వీడియోను నయనతార, విఘ్నేష్ శివన్ సెక్యూరిటీ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై ఇరువురు అభిమానులు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు. 

నయనతార, ధనుశ్ మ‌ధ్య‌ వివాదం ఇదే..
నయనతార తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌‌లోని ఆసక్తికరమైన విషయాల్ని‘నయనతార : బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అనే డాక్యుమెంటరీ రూపంలో తీసుకురావ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో ‘నేనూ రౌడీనే’ అనే సినిమా నుంచి 3 సెకన్ల క్లిప్పింగ్‌ను వాడారు. ఈ సినిమాకి ధనుశ్ నిర్మాత‌. అయితే, తన అనుమతి లేకుండా ఆ క్లిప్పింగ్‌ను వాడారని కోప్పడిన ధనుశ్‌.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపారు. తాము ధ‌నుశ్ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కోసం రెండేళ్ల‌పాటు ఎదురుచూశామ‌ని, కానీ ఆయ‌న స్పందించ‌లేదంటూ న‌య‌న‌తార ఆరోపించారు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య వివాదం నెల‌కొంది. 
Nayanthara
Dhanush
Wedding Ceremony
Kollywood

More Telugu News