Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

BR Naidu meets CM Revanth Reddy
  • జుబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కలిసిన టీటీడీ చైర్మన్
  • సీఎంకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించిన సీఎం
  • నిన్న కేటీఆర్‌ను కలిసిన బీఆర్ నాయుడు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్ సీఎం నివాసంలో కలిశారు. రేవంత్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు.

తెలంగాణ భక్తుల దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలను టీటీడీ పరిగణనలోకి తీసుకునే అంశంపై చర్చించి ఉంటారని భావిస్తున్నారు. బీఆర్ నాయుడు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ నిన్న విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Revanth Reddy
Telangana
TTD
BR Naidu
Tirumala

More Telugu News