లా విద్యార్థినిపై అత్యాచారం కేసు... నలుగురు నిందితుల అరెస్ట్
- కేసులో ప్రధాన నిందితుడు వంశీ అరెస్ట్
- అతనితో పాటు ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
బాధితురాలిని ప్రేమ, పెళ్లి పేరుతో వంశీ దగ్గరై నమ్మించి మోసం చేశాడు. వంశీ ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి కూడా అత్యాచారం చేశాడు. ఈ ఘటన కలకలం రేపింది.
బాధితురాలు మధురవాడలోని ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. తన సహచర విద్యార్థి వంశీతో స్నేహం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ... గత ఆగస్ట్ 10న ఆమెను కంబాలకొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అదే నెల 13న తన స్నేహితుడు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్ కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమెను బెదరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు.