తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంపై ఏఆర్ రెహమాన్ కుమారుడు, కూతురి స్పందన
- విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు
- 29 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు
- తమ గోప్యతను గౌరవించాలన్న రెహమాన్ కుమారుడు
తమ తల్లిదండ్రులు విడిపోతుండటంపై వారి కుమారుడు అమీన్, కూతురు రహిమా స్పందించారు. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ తమ గోప్యతను గౌరవించాలని అమీన్ కోరారు. మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. రహిమా స్పందిస్తూ... ఈ విషయంలో గోప్యత పాటిస్తూ, గౌరవిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు.