బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
- లగచర్ల దాడి కేసులో రిమాండ్ లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి
- ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
- ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి
మరోవైపు నరేందర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయాలనే పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున... బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.