AP Assembly: ఏడు బిల్లులకు ఆమోదముద్ర వేసిన ఏపీ అసెంబ్లీ

AP Assembly passes 5 bills
  • ఏపీ మున్సిపల్ సవరణ బిల్లుకు ఆమోదం
  • పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం
  • ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లుకు ఆమోదం
ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు - 2024, ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు - 2024, హెల్త్ యూనివర్శిటీ సవరణ బిల్లు - 2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు - 2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు - 2024లను అసెంబ్లీ ఆమోదించింది. 

ఏపీ సహకార సంఘం సవరణ బిల్లు - 2024, ఎంత మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకొచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు రేపటికి వాయిదా వేశారు.
AP Assembly
Bills

More Telugu News