Telangana: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు.. ప్రధాన ద్వారం మూసివేత

Vaastu changes to Telangana Secretariat
  • సచివాలయానికి తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వారం
  • తలుపులు తీసేసి రేకులు ఉంచిన అధికారులు
  • ఈశాన్య గేటుకు తూర్పు వైపున ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయనున్న వైనం
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి స్వల్పంగా వాస్తు మార్పులు చేస్తున్నారు. సచివాలయానికి తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసివేస్తున్నారు. ఈ మార్పులో భాగంగా ప్రస్తుత ప్రధాన ద్వారం తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో రేకులు ఉంచారు. ఈశాన్య గేటుకు తూర్పు వైపున ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ప్రధాన ద్వారం ఉన్న చోట మరో గేటును ఏర్పాటు చేస్తారు. సచివాలయంలోని మిగిలిన గేట్లను యథావిధిగా ఉంచనున్నారు. వచ్చే నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఆ లోపలే సచివాలయ వాస్తు మార్పులు పూర్తి చేసే పనుల్లో అధికారులు ఉన్నారు.
Telangana
Secreatariat
Vaastu

More Telugu News