CM Revanth Reddy: ఇవి కొంతమందికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు: దామోదర రాజనర్సింహ

conspiracy politics are not there in congress says damodara rajanarsimha
  • కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం
  • ఆందోల్‌లో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో మాట్లాడిన రాజనర్సింహ
  • రేవంత్ సర్కార్‌కు ఉచ్చు బిగుసుకుంటుందంటూ కొంత మంది ఢిల్లీకి పోయారని రాజనర్సింహ ఎద్దేవా
లగచర్లలో కలెక్టర్‌పై దాడికి పాల్పడి కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. లగచర్ల ఘటనకు సంబంధించి రేవంత్ సర్కార్‌కు ఉచ్చు బిగుసుకుంటుందంటూ కొంత మంది ఢిల్లీకి పోయారని విమర్శించారు. ఇవన్నీ కొంత మందికి పుట్టుకతో వచ్చిన బుద్ధులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటువంటివి కాంగ్రెస్‌కు అలవాటు లేదన్నారు. 

తెలంగాణ రాష్ట్రం గత పదేళ్లలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. రూ.50వేల కోట్ల అప్పు తీర్చిన ఘనత రేవంత్ రెడ్డి సర్కారుదని మంత్రి రాజనర్సింహ అన్నారు. అధికారంలోకి వచ్చి కనీసం పది నెలలు కాకుండానే ప్రభుత్వంపై కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని రూపుమాపాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
CM Revanth Reddy
Lagacharla
Damodara Raja Narasimha
Telangana

More Telugu News