Nayanthara: నయన్, ధనుష్ ల మధ్య గొడవేంటి..? రూ.10 కోట్ల నోటీసులేంటి?

10 Crore Lawsuit Over 3 Second Clip Whats Behind Nayanthara Dhanush Spat
  • తన జీవితంపై డాక్యుమెంటరీ తీసిన నయనతార
  • ధనుష్ నిర్మాతగా 2015లో నయన్ సినిమా
  • అందులోని ఓ క్లిప్ ను తన డాక్యుమెంటరీలో వాడుకున్న హీరోయిన్
  • అనుమతి లేకుండా వాడుకున్నారంటూ నోటీసులు పంపిన ధనుష్
ప్రముఖ హీరోయిన్ నయనతార, హీరో, నిర్మాత ధనుష్ మధ్య గొడవ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. హీరో ధనుష్ ను తీవ్రంగా విమర్శిస్తూ నయనతార ఏకంగా మూడు పేజీల బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేసింది. ఈ వివాదంలో పలువురు హీరోయిన్లు నయనతారకు అండగా నిలుస్తున్నారు. హీరో ధనుష్ మాత్రం దీనిపై స్పందించలేదు. ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రముఖ హీరోయిన్, ప్రముఖ హీరోల మధ్య అసలు గొడవ ఎందుకు వచ్చింది.. నయనతారకు రూ. 10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ నోటీసులు ఎందుకు పంపించాడంటే...?

నయనతార తన జీవితంపై ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. ‘నయనతార- బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీలో ఇండస్ట్రీలో తన ప్రయాణం, విఘ్నేశ్ శివన్ తో తన ప్రేమ, పెళ్లి తదితర వివరాలన్నీ చూపించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా తామిద్దరి పరిచయం, ప్రేమకు దారితీసిన సినిమా ‘నానుం రౌడీ ధాన్’ లో ఓ చిన్న సన్నివేశాన్ని తన డాక్యుమెంటరీలో ఉపయోగించుకుంది. సినిమాలో నుంచి చిన్న క్లిప్ ను వాడుకోవడానికి ఆ సినిమాను నిర్మించిన ధనుష్ అనుమతి కోసం చాలా ప్రయత్నించింది. అయితే, ధనుష్ మాత్రం ఎటూ తేల్చకుండా, నయనతారకు ఎలాంటి జవాబివ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. తీరా ఇటీవల నయనతార తన డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశాక ధనుష్ రూ.10 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపాడు. దీనిపై నయనతార మండిపడుతోంది.

3 సెకన్ల క్లిప్..
నానుం రౌడీ ధాన్ సినిమాలో నయన్ హీరోయిన్ గా చేయగా విఘ్నేశ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2015లో సంచలన విజయం నమోదు చేసింది. నయన్ తో పాటు విఘ్నేశ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా చేస్తుండగానే వారి మధ్య పరిచయం పెరిగి ప్రేమకు దారితీసింది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ సందర్భాన్ని తన డాక్యుమెంటరీలో చూపించాలని నయన్ తీవ్రంగా ప్రయత్నించింది. ధనుష్ అనుమతి కోసం ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో మరో దారి లేక కేవలం 3 సెకన్ల క్లిప్ ను మాత్రమే తన డాక్యుమెంటరీలో వాడుకుంది.
Nayanthara
Dhanush
Lawsuit
10 Crore
Doccumentary
Vignesh

More Telugu News