Rohit Sharma: మేం నలుగురం అంటూ రోహిత్ శర్మ పోస్ట్

Rohit Sharma announces birth of baby boy
  • ఫ్యామిలీ అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేసిన రోహిత్ శర్మ
  • నిన్న మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ శర్మ భార్య రితికా
  • భార్య కాన్పు నేపథ్యంలో భారత్‌లోనే ఉండిపోయిన రోహిత్ శర్మ
మేం నలుగురమయ్యామంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో 'ఫ్యామిలీ' అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే నిన్న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఆయన అభిమానులతో పంచుకున్నాడు. రోహిత్ శర్మ-రితిక దంపతులకు సమైరా అనే కూతురు ఉంది. ఇప్పుడు వారికి పుత్రోదయం అయింది.

2015 డిసెంబర్ 13న వీరి పెళ్లి జరిగింది. వీరిది ప్రేమ వివాహం. 2018 డిసెంబర్ 30న వీరి జీవితంలోకి సమైరా వచ్చింది. అప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో ఆడకూతురు జన్మించింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ఆ దేశానికి చేరుకుంది. భార్య రెండో కాన్పు నేపథ్యంలో రోహిత్ శర్మ భారత్‌లోనే ఉండిపోయాడు. టీమిండియా ప్లేయర్లు సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ... రోహిత్ శర్మకు శుభాకాంక్షలు చెప్పారు. 
Rohit Sharma
Team India
Cricket

More Telugu News