ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం
- ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ
- దేవగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం
- సాంకేతిక సమస్యను ముందే గుర్తించిన అధికారులు
అయితే ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రధాని ఇక్కడి దేవగఢ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. ఝార్ఖండ్‌లో ఈ నెల 20న రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు.