Hyderabad: సీసీ కెమెరాల్లో హైదరాబాద్​ రికార్డ్​... ఎంత మందికి ఎన్ని కెమెరాలంటే!

Hyderabad record in CCTV cameras How many cameras for how many people
  • ట్రాఫిక్ నియంత్రణ నుంచి భద్రత, నిఘా దాకా సీసీ కెమెరాల తోడ్పాటు
  • ఇటీవల నివేదిక విడుదల చేసిన కంపారిటెక్ సంస్థ
  • ప్రపంచంలోని పెద్ద నగరాల్లో సగటున సీసీ కెమెరాల సంఖ్య వెల్లడి
రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ నుంచి నేరాల నియంత్రణ దాకా ఎన్నో అంశాల్లో సీసీ కెమెరాల సాయం ఎంతో కీలకం. ఇళ్లు, ఆఫీసులు అనే కాకుండా... వీధి వీధినా, ప్రధాన రోడ్లు, కూడళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులోనూ హైదరాబాద్ నగరం ఎంతో ప్రత్యేకం. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో హైదరాబాద్ మహా నగరం పరిధిలో అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా కొనసాగుతోంది. 

చైనాను మినహాయిస్తే... హైదరాబాద్ టాప్
సీసీ కెమెరాల సంఖ్యలో హైదరాబాద్ ప్రపంచంతోనే పోటీ పడుతోంది. ఒక్క చైనా మినహాయిస్తే... ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోని నగరాలతో పోల్చినా హైదరాబాద్ లో సీసీ కెమెరాల సంఖ్య ఎక్కువ. దీనికి సంబంధించి కంపారిటెక్ సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద నగరాల్లో... సగటున వెయ్యి మంది జనాభాకు ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయన్న వివరాలను విడుదల చేసింది. ఆ వివరాలు ఇవిగో...

ప్రపంచంలోని పెద్ద నగరాల్లో...
సగటున వెయ్యి మంది జనాభాకు సీసీ కెమెరాల సంఖ్య 
నగరం
సీసీ కెమెరాల సంఖ్య (ప్రతి వెయ్యి జనాభాకు...)
చైనాలోని నగరాలు439 (సగటున)
హైదరాబాద్83
ఇండోర్60
ఢిల్లీ20
సింగపూర్18
మాస్కో17
బాగ్దాద్15
సియోల్14
సెయింట్ పీటర్స్ బర్గ్13
లండన్13
లాస్ ఏంజిలిస్10
బుసాన్10
హో చి మిన్8
క్సిన్ బే8
చెన్నై8
బెర్లిన్8
హాంగ్ కాంగ్7
పుణె7
ఇస్తాంబుల్7
కోచి7
బ్యాంకాంగ్6
సిడ్నీ5
మాడ్రిడ్4.2
పారిస్4
రియో డి జెనోరో2
కేప్ టౌన్1.6
టోక్యో1
టెల్ అవీవ్1
Hyderabad
offbeat
international
Information
CCTV
china

More Telugu News