India Vs south Africa: దక్షిణాఫ్రికాపై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ

India registered an impressive 11 run win in the 3rd T20 against South Africa
  • 11 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు
  • 220 పరుగుల లక్ష్య ఛేదనలో 208 స్కోరుకే పరిమితమైన సఫారీ టీమ్
  • సెంచరీతో రాణించిన తిలక్ వర్మకు దక్కిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’
  • సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచిన టీమిండియా
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. తిలక్ వర్మ సెంచరీ సాయంతో టీమిండియా నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య సఫారీ జట్టు ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులకే పరిమితమైంది. దీంతో 11 పరుగుల తేడాతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్ 41 పరుగులు, మార్కో యన్‌సెన్ 54 రన్స్ తో రాణించారు. అయినప్పటికీ భారత బౌలర్లు మ్యాచ్‌ను చేజారనివ్వలేదు. సమష్టి ప్రదర్శనతో భారత్‌ను విజేతగా నిలిపారు. దీంతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

మూడో టీ20లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించారు. బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ మూడు కీలకమైన వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఐడెన్ మార్క్రమ్ 29, ర్యాన్ రికెల్టన్ 20, రీజా హెండ్రిక్స్ 21, ట్రిస్టన్ స్టబ్స్ 12, హెన్రిచ్ క్లాసెన్ 41, డేవిడ్ మిల్లర్ 18, మార్కో యన్‌సెన్ 54, గెరాల్డ్ కోయెట్జీ 2(నాటౌట్), సిమలానీ 5 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 1, సంజు శాంసన్ 0, అభిషేక్ శర్మ 50, తిలక్ వర్మ 107 (నాటౌట్), హార్దిక్ పాండ్యా 18, రింకూ సింగ్ 8, రమణ్‌దీప్ సింగ్ 15, అక్షర్ పటేల్ 1 (నాటౌట్) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మహారాజ్, సిమలానీ చెరో 2 వికెట్లు, యన్‌సెన్ 1 వికెట్ తీశారు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.  
India Vs south Africa
Team India
Team South Africa
Cricket
Sports News

More Telugu News