Train Accident: పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. 20 ప్యాసింజర్ రైళ్ల రద్దు

Goods Rail That Carries Iron Ore Derailed In Peddapalli District
  • ఐరన్ ఓర్‌తో వెళుతున్న రైలు
  • రాఘవాపురం-రామగుండం మధ్య పట్టాలు తప్పిన రైలు
  • పక్కకి ఒరిగిపోయిన 11 బోగీలు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో 20 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. ఐరన్ ఓర్‌తో వెళుతున్న రైలు రాఘవాపురం, రామగుండం మధ్య గత రాత్రి పొద్దుపోయాక పట్టాలు తప్పిందని, 11 బోగీలు పక్కకు ఒరిగిపోయాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 

ప్రమాదం కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన 20 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, పది రైళ్లను మళ్లించినట్టు తెలిపింది. రెండు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం ట్రాక్‌ను సరిచేసే పనిలో ఉన్నామని, త్వరలోనే రైళ్ల రాకపోకలను పునుద్ధరిస్తామని రైల్వే తెలిపింది.
Train Accident
Peddapalli District
Goods Rail
Telangana

More Telugu News