DK Aruna: ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఇదివరకే హెచ్చరించా: డీకే అరుణ

DK Aruna says she already warned Revanth Reddy about Pharma city
  • ఫార్మా సిటీపై పట్టింపులకు, పంతాలకు పోవద్దని సీఎంకు ఇదివరకే చెప్పానన్న అరుణ
  • ప్రాణాలు పోయినా సరే ఫార్మా సిటీని అడ్డుకుంటామని రైతుల చెబుతున్నారని వ్యాఖ్య
  • ఎంత ప్యాకేజీ ఇచ్చినా భూములిచ్చేందుకు వారు ససేమిరా అంటున్నట్లు వెల్లడి
ఫార్మా సిటీకి సంబంధించి పట్టా భూముల జోలికి వెళ్లొద్దని తాను గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించానని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. వికారాబాద్ కలెక్టర్ మీద దాడి ఘటనపై ఆమె స్పందించారు. ఈ మేరకు వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఫార్మా సిటీపై పంతాలకు, పట్టింపులకు వెళ్లవద్దని సీఎంకు గతంలోనే సూచించినట్లు చెప్పారు.

ఫార్మా సిటీ తనకు వద్దని రైతులు గతంలోనే ధర్నా చేశారన్నారు. ఆ ధర్నాకు తాను మద్దతుగా వెళ్లినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారన్నారు. ప్రాణాలు పోయినా సరే ఫార్మా సిటీని అడ్డుకుంటామని రైతులు చెప్పారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఏవైనా పరిశ్రమలు పెట్టుకోవాలని రైతులు స్పష్టం చేశారని తెలిపారు. తమ భూములు కోల్పోతే జీవనాధారం కోల్పోతామని వారు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ప్యాకేజీ ఎంత ఇచ్చినా భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారన్నారు.
DK Aruna
Telangana
BRS
Revanth Reddy

More Telugu News