KTR: ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యాను... అప్పుడే హైదరాబాద్‌లో ప్రకంపనలు వచ్చాయి: కేటీఆర్

Just landed in Delhi heard the tremors are being felt in Hyderabad already says KTR
  • ఎక్స్ వేదికగా కేటీఆర్ చురక
  • అమృత్ టెండర్లపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి కేటీఆర్
  • రేపు మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవనున్న కేటీఆర్
"నేను ఇప్పుడే దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యాను... కానీ అప్పుడే హైదరాబాద్‌లో ప్రకంపనలు వచ్చినట్లు విన్నాను... అప్పుడే వణికితే ఎలా?" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అమృత్ టెండర్ల విషయంలో సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన రేపు కేంద్రమంత్రిని కలిసి ఫిర్యాదు చేయనన్నారు. ఇప్పటికే ఆయన కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖ రాశారు. ఇప్పుడు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఈరోజు ఢిల్లీకి వెళ్లారు.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడి విషయమై స్పందించిన కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే తిరగబడ్డారని, సీఎం మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ అని పేర్కొన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి దురాశ వల్ల, అవగాహనారాహిత్యం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు.

భూసేకరణ పూర్తయి... అన్ని అనుమతులు వచ్చి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని రద్దు చేసి, రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే తుగ్లక్ అలోచన వల్లనే ఇంత అలజడి చెలరేగిందన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు అమ్ముకొని సొమ్ము చేసుకుందామన్న రేవంత్ కుత్సిత బుద్ధి వల్ల ఇప్పుడు... ఇక్కడ ఫార్మా సిటీ భవితవ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కొడంగల్‌లో అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర మొదలైందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహం, చాలాచోట్ల కట్టలు తెంచుకుంటోందని, అది ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేయనుందన్నారు.
KTR
Telangana
Congress
BRS

More Telugu News